జానీ మాస్టర్ కి బెయిల్ మంజూరు..


మన తెలుగులో సహా పాన్ ఇండియా లెవెల్లో కూడా తన కొరియోగ్రఫీతో నేషనల్ అవార్డు అందుకున్న డాన్స్ మాస్టర్ విషయంలో ఇటీవల జరిగిన సంఘటనల కోసం తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ కి తెలిసిందే. దీనితో జానీ మాస్టర్ గత కొన్ని రోజులు నుంచి పోలీసు కస్టడీలోనే ఉన్నారు. అయితే ఇటీవల తనకి బెయిలు వచ్చే ఛాన్స్ కూడా వచ్చాయి.

అయితే ఇపుడు ఫైనల్ గా తనకి బైలు మంజూరు అయ్యినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ కేసు జిల్లా కోర్టులో నడుస్తుండగా తనకి ఈ అక్టోబర్ 6 నుంచి 10 వరకు మధ్యంతర బైలు ఇచ్చినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ మధ్యలో జానీ మాస్టర్ ఓ నేషనల్ అవార్డు ఈవెంట్ కి అటెండ్ కావాల్సి ఉండగా అందుకోసం ఇప్పుడు బెయిలు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి అక్టోబర్ 10 తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఇంకా రివీల్ కావాల్సి ఉంది.

Exit mobile version