“హను మాన్” మూవీ కన్నుల పండుగ లా ఉంది – బాలకృష్ణ!

“హను మాన్” మూవీ కన్నుల పండుగ లా ఉంది – బాలకృష్ణ!

Published on Jan 17, 2024 2:35 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ సినిమాపై ఆడియెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమ కి సంబందించిన పలువురు ప్రముఖులు సైతం సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ చిత్రాన్ని చూసిన నందమూరి బాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాను బాగా హ్యాండిల్ చేశారు అని, కన్నుల పండుగ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. తను సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు