బాలయ్య, మహేష్ బాబు భారీ మల్టీస్టారర్..

బాలయ్య, మహేష్ బాబు భారీ మల్టీస్టారర్..

Published on Sep 8, 2024 4:14 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో మరోసారి మల్టీస్టారర్ చిత్రాల పర్వం ఊపందుకున్న సంగతి తెలిసిందే. అలా మన టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా ఒకొక్కరు మరో హీరోలతో సినిమాలు చేసి భారీ సక్సెస్ లు అందుకున్నారు. అయితే లేటెస్ట్ గా మరో క్రేజీ మల్టీస్టారర్ కి బీజం పడినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. అది కూడా నటసింహం బాలకృష్ణ ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో అట.

రీసెంట్ గా టాలీవుడ్ సినిమా ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాను బాలకృష్ణ, మహేష్ బాబుల కాంబినేషన్ కథ కోసం విన్నాను అని ఆ సినిమాకి కూడా తానే వర్క్ చేస్తున్నట్టుగా థమన్ తెలిపాడు. సో ఈ సెన్సేషనల్ మల్టీస్టారర్ టాలీవుడ్ నుంచి రానున్న రోజుల్లో రాబోతుంది అని చెప్పాలి. మరి ఇది ఏ దర్శకుడు ప్లాన్ చేసాడు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరి ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ ని ప్లాన్ చేసిన ఆ దర్శకుడు ఎవరో ఎలాంటి సబ్జెక్టుతో ప్లాన్ చేసాడో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు