బాలయ్య సూపర్‌హీరో.. ఈసారి దెబ్బకి థింకింగ్ మారి తీరాలే!

బాలయ్య సూపర్‌హీరో.. ఈసారి దెబ్బకి థింకింగ్ మారి తీరాలే!

Published on Oct 12, 2024 2:00 AM IST

నందమూరి బాలకృష్ణ ఓ సూపర్‌హీరో పాత్రలో సినిమా చేయనున్నాడు.. ఈ సినిమాలో బడా బడా యాక్టర్స్ నటించబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో నిన్నటి నుండి వార్తలు వినిపిస్తూ వచ్చాయి. వాటిని చూసి అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే, బాలయ్య ఏ సూపర్ హీరో సినిమా చేయడం లేదని క్లారిటీ వచ్చేసంది.

‘‘మాస్ హీరోలను చూసుంటారు.. సూపర్ హీరోలను చూసుంటారు.. కానీ ఓ మాస్ సూపర్ హీరోని దసరా రోజున చూస్తారు..’’ అంటూ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా తాజాగా వెల్లడించింది. దీంతో బాలయ్యకు సంబంధించిన బ్లాక్‌బస్టర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ గురించే ఈ పోస్ట్ అనేది కన్ఫమ్ అయ్యింది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు వెలువడనుంది.

ఇక బాలయ్య ప్రస్తుతం NBK109 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు