బాలయ్య కొట్టినందుకు సంతోషంగా ఉంది !

Published on Mar 7, 2021 2:10 am IST

నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లి అక్కడ తన అభిమాని పై చేయి చేసుకున్నారన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన పై బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న ఆ అభిమాని స్పందిస్తూ బాలయ్య తనను కొట్టడం పై అతను తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఇంతకీ అతను ఆ వీడియోలో ఏమి చెప్పాడు అంటే..

‘‘నా పేరు సోము. బాలయ్య బాబుగారికి వీరాభిమానిని. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బాలయ్య బాబుగారు భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా శ్రమిస్తున్నారు. ఇక ప్రచారంలో భాగంగా బాలకృష్ణగారు మా అన్నయ్య ఇంటికి వచ్చారు. నేను ఎవరో తెలియక బయట వ్యక్తి అనుకుని నన్ను పక్కకు తోశారు. అయినా ఇలాంటి వాటిని మాలాంటి ఎన్బీకే ఫ్యాన్స్ పట్టించుకోము. అసలు ఈ రోజు ప్రచారంలో బాలయ్య బాబు గారు ఎవరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాంటిది ఈ రోజు నన్ను ఆయన టచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై బాలయ్య’’ అంటూ ఆ అభిమాని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :