అమెరికాలో బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు చలన చిత్ర రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా అమెరికాలో బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. సెప్టెంబర్ 14న అమెరికా న్యూ ఇంగ్లాండ్‌లో శ్రీ బోళ్ల మరియు తరణి పరుచూరి ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌ను అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం నిర్వహించడంలో రావి అంకినీడు ప్రసాద్, అశ్విన్ అట్లూరి, శ్రీనివాస్ గొంది, అనిల్ పొట్లూరి, శ్రీకాంత్ జాస్తి, సురేష్ దగ్గుపాటీ, సూర్య తెలప్రోలు, చంద్ర వల్లూరుపల్లి, రావ్ కందుకూరి, శశాంక్, దీప్తి కొర్రపల్లి, కాళిదాస్ సూరపనేని కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో భాగంగా బాలయ్య అభిమానులు కేక్ కట్టింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీతా, శశాంక్‌లు వ్యాఖ్యతగా వ్యవహరించారు. ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ శైలజ చౌదరి అండ్ గ్రూప్ తమ నృత్య ప్రదర్శనతో నందమూరి అభిమానులను ఆకట్టుకున్నారు.

ఇక ఇటీవల సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్‌లో బాలయ్య అభిమానులు, సినీ ప్రముఖులు గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version