బాలయ్య కెరీర్ లో అక్కడ హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన ‘వీరసింహారెడ్డి’

బాలయ్య కెరీర్ లో అక్కడ హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన ‘వీరసింహారెడ్డి’

Published on Jan 12, 2023 11:00 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ, శతి హాసన్ ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మించగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్, హానీ రోజ్ నటించారు. దునియా విజయ్ విలన్ గా నటించిన ఈ మూవీ ని గోపీచంద్ మలినేని తెరకెక్కించగా ఎన్నో అంచనాలతో ఈ మూవీ నేడు ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి మంచి టాక్ తో కొనసాగుతోంది.

అయితే విషయం ఏమిటంటే, ఇటు మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు యుఎఏ ఆడియన్స్ లో సైతం ఎంతో మంచి హైప్ ఏర్పరిచిన వీరసింహారెడ్డి మూవీ ప్రస్తుతం 1 మిలియన్ డాలర్స్ ప్రీమియర్ కలెక్షన్ దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి మొత్తంగా 708కె డాలర్స్ కలెక్షన్ వచ్చిందని, ఇది నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అక్కడ హయ్యెస్ట్ కలెక్షన్ అని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి రాబోయే రోజుల్లో వీరసింహారెడ్డి మూవీ ఇంకెంతమేర కొల్లగొడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు