‘డాకు మహారాజ్’ ఈవెంట్ కోసం డల్లాస్ చేరుకున్న బాలయ్య

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే అంచనాలను పెంచింది.

అయితే, తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కోసం నందమూరి బాలకృష్ణ తాజాగా అమెరికాకు చేరుకున్నారు. ఆయన ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన ఫోటోస్, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాలయ్య ఈ సినిమా ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Exit mobile version