‘బ‌డ్డీ’ మూవీలో బాల‌య్య రిఫ‌రెన్స్.. అభిమానుల‌కు పూన‌కాలే!

‘బ‌డ్డీ’ మూవీలో బాల‌య్య రిఫ‌రెన్స్.. అభిమానుల‌కు పూన‌కాలే!

Published on Jul 22, 2024 11:30 AM IST

మెగా హీరో అల్లు శిరీష్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘బ‌డ్డీ’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను సామ్ ఆంటోన్ డైరెక్ట్ చేయ‌గా, ఫిక్ష‌న‌ల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ప్రేక్షకుల‌ను అల‌రించ‌నుంది. ఇక ఈ సినిమాలో ఫ్లైట్ కెప్టెన్ గా అల్లు శిరీష్ న‌టిస్తుండ‌గా, ఓ గ్రాఫిక్స్ టెడ్డీ బియ‌ర్ చుట్టూ క‌థ సాగ‌నుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్లు సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి.

కాగా, ఈ సినిమాలో అభిమానుల‌కు ఓ స‌ర్ప్రైజ్ ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో నట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కు సంబంధించిన ఓ రిఫ‌రెన్స్ ఉండ‌నుంద‌ట. ‘జై బాల‌య్య’ స్లోగ‌న్ తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్ల‌నున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఓ యాక్ష‌న్ సీన్ సంద‌ర్భంగా ఈ స్లోగ‌న్ ఉంటుంద‌ని, ”భ‌గ‌వంత్ కేస‌రి” సినిమాలోని థీమ్ మ్యూజిక్ కూడా ప్రేక్ష‌కుల‌ను స‌ర్ ప్రైజ్ చేయ‌నుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా అజ్మ‌ల్, ముఖేష్ కుమార్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగ‌స్టు 2న రిలీజ్ కు రెడీ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు