లేటెస్ట్ : బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షో క్రేజీ అప్ డేట్

Published on Sep 24, 2022 2:51 am IST

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ప్రసారమైన క్రేజీ షో అన్ స్టాపబుల్. ఇక ఈ షో ద్వారా తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరించిన బాలకృష్ణ తన అత్యద్భుత హోస్టింగ్ టాలెంట్ తో షో కి ఎంతో మంచి జోష్ తీసుకువచ్చారు అనే చెప్పాలి. ఇక పలువురు సినీ సెలెబ్రిటీస్ ఈ షోకి ప్రత్యేక గెస్ట్ లు గా విచ్చేసి తమ తమ సినీ, వ్యక్తిగత విషయాలను షో ద్వారా ఫ్యాన్స్ తో ఆడియన్స్ తో పంచుకోవడం జరిగింది.

ఇక ఈ షోకి అప్పట్లో భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అయితే అప్పటి నుండి అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా అందరిలో మంచి జోష్ నింపేందుకు ఆహా వారు సిద్ధం అయ్యారు. అతి త్వరలో అన్ స్టాపబుల్ సీజన్ 2 యొక్క యాంతమ్ థీమ్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా తెలిపారు. మొదటి సీజన్ ని మించేలా మరింత జోరుతో క్రేజీగా సీజన్ 2 సాగనుందని, ఆ విధంగా ఆహా వారు ప్లాన్ చేసారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :