టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘వెంకీ-అనిల్ 3’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర సెట్స్‌లో మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ(Balakrishna) సందడి చేశాడు.
గతంలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రంలో నటించాడు. దీంతో ఇప్పుడు ఈ డైరెక్టర్ వెంకటేష్‌తో తెరకెక్కిస్తున్న సినిమా సెట్స్‌లో ఆయన కాసేపు సందడి చేశాడు. సినిమా షూటింగ్ వివరాలు చిత్ర యూనిట్‌ను అడిగి తెలుసుకున్నాడు. ఇక వెంకటేష్‌తో పాటు అనిల్ రావిపూడితో బాలయ్య చేసిన సందడికి సంబంధించిన ఓ వీడియో మేకర్స్ నెట్టింట రిలీజ్ చేశారు.
కాగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇందులో వెంకటేష్ ఓ ఎక్స్ కాప్‌గా కనిపిస్తాడు. ఆయన సరసన అందాల భామలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.