ఆ రీమేక్ మల్టీస్టారర్ లో ‘రానా’ ఫిక్స్ ?

Published on Apr 5, 2020 11:16 pm IST


మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేయబోతోందని.. ఈ సినిమాలో బాలయ్య బాబు అండ్ మంచి విష్ణు కలిసి నటించబోతున్నారని ఇటివలే వార్తలు వచ్చాయి. ఆ తరువాత మళ్ళీ ఈ రీమేక్ లో బాలకృష్ణతో రానా దగ్గుబాటి నటించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపించింది. ఇప్పుడే ఇదే నిజమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ రీమేక్ లో నటించడానికి బాలయ్య – రానా అంగీకరించారట. ఒరిజినల్ వర్షన్‌ లో పోలీస్ కారెక్టర్ చేసిన బిజూ మీనన్ పాత్రలో తెలుగులో బాలయ్య బాబు చేయబోతున్నాడట.

అలాగే మరో హీరో పాత్రలో రానా నటిస్తాడు. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ ఈ సినిమా ఉంటుందని.. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ఇప్పటికే నిర్మాత సూర్య దేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య రానా కలిసి నటించారు. మళ్ళి ఈ సినిమాతో మరోసారి కలిసి నటించబోతున్నారు.

సంబంధిత సమాచారం :

X
More