బాలయ్య సినిమాలో ఆ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణ అట !

Published on Aug 10, 2020 11:57 pm IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమా ‘బీబీ3′ పేరుతో విడుద‌ల‌ చేసిన టీజ‌ర్ ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అయితే రెండు క్యారెక్టర్ల మధ్య నడిచే వార్ ఆదారంగా ఈ సినిమా ప్లే ఉంటుందని తెలుస్తోంది. హీరో క్యారెక్టర్ కి, విలన్ క్యారెక్టర్ కి మధ్య జరిగే సస్పెన్స్ డ్రామానే బోయపాటి తనదైన మాస్ స్టైల్ లో తెరకెకెక్కించబోతున్నారని తెలుస్తోంది.

మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో అసలు విలన్ ఎవరు అనే కోణంలో వచ్చే సస్పెన్స్ సీక్వెన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More