బాలయ్య సినిమా టైటిల్ ఫిక్స్ ?

Published on Aug 16, 2020 12:11 am IST


బోయపాటి, బాలయ్య సినిమా టైటిల్ ఇదేనంటూ ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో ప్రధానంగా ‘మోనార్క్‌’ అండ్ ‘డేంజర్’ అనే టైటిల్స్ బాగా వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాకి ‘డేంజర్’ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే గతంలో డేంజర్ అనే టైటిల్ తో 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా వచ్చింది. ఇందులో అల్లరి నరేష్, సాయిరాం శంకర్, కలర్స్ స్వాతి ముఖ్య పాత్రల్లో నటించారు.

అయితే పది సంవత్సరాలు దాటి పోయింది కాబట్టి ఈ టైటిల్ ను మరో సినిమాకి పెట్టుకోవచ్చు. అందుకే దాదాపు ఈ టైటిల్ కే బోయపాటి ఫిక్స్ అయి ఉన్నాడట. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడని తెలుస్తోంది. ఇక టీజ‌ర్ ను ‘బీబీ3′ పేరుతో విడుద‌ల‌ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో పాటు పంచ కట్టులో వైట్ అండ్ వైట్ లో అభిమానులను అలరించారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోందని బోయపాటి ఇప్పటికే చెప్పారు. ఏమైనా బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి సూపర్ హిట్ ఇచ్చేలానే ఉన్నాడు.

సంబంధిత సమాచారం :

More