ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 109వ సినిమాని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా టైటిల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇది అతి త్వరలోనే ఉంటుంది అని ఇటీవల దర్శకుడు కన్ఫర్మ్ చేశారు.
అయితే బాలయ్య సినిమాలు రాజకీయాలు అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తారని తెలిసిందే. తన తల్లి పేరిట బసవతారకం అనే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతోమంది క్యాన్సర్ పేషంట్లకి మెరుగైన సేవలు అందిస్తున్నారు. అయితే బాలయ్య చిన్న పిల్లల విషయంలో ఎంతో సున్నితంగా ఉంటారు.
అలా తాజాగా తన దృష్టికి వచ్చిన ఓ చిన్నారి కోసం వెంటనే తన హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందిస్తానని హాయ్ ఇచ్చి ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం చేస్తున్నారట. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ద్వారా కడియపులంకకి చెందిన ఓ చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాలయ్య దృష్టికి రాగ దానితో వెంటనే బాలయ్య స్పందించి చిన్నారిని తన హాస్పిటల్ లో వెంటనే జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారట. దీనితో మరోసారి బాలయ్య తన బంగారు మనసు చాటుకున్నారని చెప్పాలి.