రత్నం కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ?

రత్నం కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ?

Published on Mar 14, 2021 3:00 AM IST

రచయిత ఎమ్ రత్నం బాలయ్య బాబు కోసం ఓ కథను రాశాడని.. ఇప్పటికే బాలయ్యకు కథ కూడా వినిపించడం జరిగిందని.. రత్నం కథను బాలయ్య ఓకే చేసాడట. కాగా ఈ కథ ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ అట. అందుకే బాలయ్యకు బాగా నచ్చిందని సమాచారం. ఈ సినిమాని డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందట. అయితే 2022 ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్లాన్ లో ఉన్నారట టీమ్.

మొత్తానికి బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. బాలయ్యకు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో బోయపాటి ఈ సినిమా చేస్తున్నాడు. మొత్తానికి టీజర్ లో మాత్రం బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో… పైగా పంచ కట్టులో వైట్ అండ్ వైట్ లో అభిమానులను బాగానే అలరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు