బాలయ్య హీరోయిన్ సీనియర్ హీరోలకి మంచి ఛాయిసే !

Published on Oct 17, 2020 11:07 pm IST


నటసింహం బాల‌కృష్ణ ప్రస్తుతం బోయపాటితో చేస్తోన్న కొత్త సినిమాలో మొత్తానికి ఓ కొత్త హీరోయిన్ ను ఫైనల్ చేశాడని.. ఆమెకు కొన్ని వర్క్ షాప్స్ కూడా నిర్వహించారని.. ఇంతకీ ఆమె ఎవరు అంటే.. మలయాళ బ్యూటీ ప్రగ్యా మార్టిన్ అని వార్తలు వస్తోన్న సంగతి తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించపోయినా ఈమెనే ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రగ్యా మార్టిన్ గతంలో మలయాళంతో పాటు తమిళంలో కూడా నటించింది.

మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ‘పిశాసు’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పైగా ఈ సినిమాకిగానూ ప్రగ్యా మార్టిన్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా కూడా అవార్డ్ కూడా అందుకుంది. ప్రగ్యా మార్టిన్ లుక్స్ పరంగా బాగానే ఆకట్టుకుంటుంది. పైగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలకి హీరోయిన్ గా మంచి చాయిస్ అయ్యేలా కనిపిస్తోంది.మరి ప్రగ్యా మార్టిన్ నిజంగా బాలయ్య సరసన హీరోయిన్ గా సక్సెస్ అయితే.. ఆమెకు నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోల సరసన కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More