బాలయ్యకి ఇష్టమైన తారక్ సినిమా.. బాబీ కామెంట్స్ వైరల్

ఈ సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు బాబీ అలాగే నటసింహం బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “డాకు మహారాజ్” కూడా ఒకటి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ బాలయ్య టాక్ షోకి కూడా హాజరయ్యారు. అయితే ఇందులో బాలయ్య కావాలనే జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావన తీసుకురాలేదు అంటూ పలు పరిస్థితులు హాట్ టాపిక్ గా మారాయి.

అయితే అసలు అలాంటివి ఏమి జరగనేలేదు అని నిర్మాత నాగవంశీ అలాగే దర్శకుడు బాబీ ఇపుడు అంటున్నారు. మరి లేటెస్ట్ గా బాబీ కామెంట్స్ వైరల్ గా మారాయి. తను మాట్లాడుతూ బాలకృష్ణ గారికి తారక్ చేసిన జై లవకుశ సినిమా ఎంతో ఇష్టం అని వ్యాఖ్యానించారు. అలాగే ఆరోజున మీరు అనుకున్న డ్రామా ఏమి జరగలేదని క్లారిటీ ఇచ్చారు. సో ఆ నెగిటివ్ కామెంట్స్ లో నిజం లేదని చెప్పాలి. ఇక డాకు మహారాజ్ ఈ జనవరి 12 న గ్రాండ్ గా రిలీస్ కి రాబోతుంది.

Exit mobile version