“ఆదిత్య 369” సీక్వెల్లో బాలయ్య లుక్ ఇదే.. తన టాక్ షోలో లీక్

“ఆదిత్య 369” సీక్వెల్లో బాలయ్య లుక్ ఇదే.. తన టాక్ షోలో లీక్

Published on Dec 4, 2024 6:01 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు సాలిడ్ లైనప్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య చేసిన ఇన్నేళ్ల చిత్రాల్లో పలు సినిమాలు అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటాయని చెప్పాలి. మరి అలాంటి క్రేజీ కాన్సెప్ట్ చిత్రాల్లో అప్పట్లోనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో భారీ విజువల్స్ తో వచ్చిన సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం “ఆదిత్య 369” అంటే తెలియని వారు ఉండరు.

లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రానికి బాలయ్య సీక్వెల్ “ఆదిత్య 999” ఉంది అని ఎప్పుడు నుంచో కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే దీనిని తన వారసుడు మోక్షజ్ఞ్యతో చేస్తానని అది కూడా తన కథ దర్శకత్వంలోనే సినిమా ఉంటుంది అని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. అయితే ఇది కాకుండా బాలయ్య నుంచి ఈ అవైటెడ్ సీక్వెల్ పై క్రేజీ లీక్ బయటకి ఇచ్చారు.

ఈ చిత్రంలో తన లుక్ ఎలా ఉండబోతుందో తదుపరి ఎపిసోడ్ లో అలా రెడీ అయ్యి చూపించారు. మరి ఇందులో బాలయ్య ఫుల్ ఓల్డేజ్ లుక్ లో ఒక వ్యోమగామిలా కనిపిస్తున్నారు. దీంతో బాలయ్య మాత్రం పక్కా ప్లానింగ్ ప్రకారం రాబోతున్నారని చెప్పాలి. ఇక ఈ ఎపిసోడ్ డిసెంబర్ 6 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు