‘మోనార్క్‌’ కోసం బాలయ్యకు మేకప్‌ టెస్ట్‌ !

Published on Jun 2, 2020 3:00 am IST


మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అయితే అందులో ఒక పాత్ర అఘోర పాత్ర. దీని కోసం రెండు రకాల గెటప్పులు డిజైన్ చేసినట్టు సమాచారం. త్వరలో ఆ రెండు గెటప్పులతో బాలయ్యకు మేకప్‌ టెస్ట్‌ లు చేసి అందులో ఒక గెటప్పుని ఫైనల్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. అన్నికుదిరితే సినిమాని కూడా త్వరలోనే పట్టాలెక్కించనున్నారు.

ఇక ఈ సినిమా టైటిల్‌ పై అనేక రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారని కూడా టాక్‌ వినిపిస్తోంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ వార్త పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది.

ఇక బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ విజయాలను అందించారు బోయపాటి. కాబట్టి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More