నిన్నటి నుండి బాలకృష్ణ కేఎస్ రవికుమార దర్శకత్వంలో చిత్రంలోని ఆయన లుక్ కి సంబంధించి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రిమ్డ్ ఫ్రెంచ్ షేవ్ లో ఉన్న బాలయ్య ఫోటోని చూసిన అభిమానులు అవాక్కయ్యారు. గతంకి భిన్నంగా ట్రెండీగా కనిపించిన బాలయ్య ఫోటో చూసి వారు ఫిదా అయ్యారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ చిత్ర యూనిట్ ఈ చిత్రంలోని బాలయ్య అధికారిక లుక్ రివీల్ చేయడం జరిగింది.
బాలయ్య సూటు బూటులో టాప్ టు బాటమ్ కార్పొరేట్ బాస్ లా తయారైన ఆ లుక్ కేకపుట్టించేలా ఉంది. బాలయ్య ఈ మధ్య కాలంలో నటించిన ఏ చిత్రంలో కూడా ఆయన ఇంత గ్లామర్ గా కనిపించలేదు అనేది నిజం. ఒక్క లుక్కుతోనే బాలయ్య తన చిత్రం పై అంచనాలు పెంచేశాడు. బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తుండగా సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశం కలదు.