సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే, ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా మల్టీస్టారర్ అని, సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని.. ఆ హీరో రవితేజ అని తెలుస్తోంది.
అనిల్ రావిపూడి ఇప్పటికే రవితేజతో ఒక సినిమా చేశాడు. ఇప్పుడు బాలయ్యతో రవితేజను కలిపి మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మరి.. బాలయ్య – రవితేజ కాంబినేషన్ అదిరిపోతోంది. అందుకే ఈ కలయికను సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడు అనిల్. అయితే, ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో కామెడీ డోస్ బాగా ఉంటుందని తెలుస్తోంది.