మరో సినిమాకి ఓకే చెప్పిన బాలయ్య !

Published on Oct 18, 2020 1:54 am IST


నటసింహం నందమూరి బాలయ్య బాబు కోసం స్టార్ రైటర్ ఎమ్ రత్నం ఓ కథను సిద్ధం చేశారు. ఇప్పటికే ఎమ్ రత్నం స్క్రిప్ట్ ను బాలయ్యకు చెప్పారట. బాలయ్యకు కథ నచ్చిందని.. ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ ను రత్నం బాలయ్య కోసం రాసాడని.. బాలయ్య సినిమా అఅంగీకరించాడని తెలుస్తోంది. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. మొత్తానికి బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. బాలయ్యకు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో బోయపాటి ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోందని బోయపాటి ఇప్పటికే చెప్పారు. మొత్తానికి టీజర్ లో మాత్రం బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో… పైగా పంచ కట్టులో వైట్ అండ్ వైట్ లో అభిమానులను బాగానే అలరించారు. ఏమైనా బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More