బాలయ్య సెన్సేషనల్ లైనప్.. క్రేజీ యూనివర్స్ లోకి అడుగు!?

బాలయ్య సెన్సేషనల్ లైనప్.. క్రేజీ యూనివర్స్ లోకి అడుగు!?

Published on Jan 28, 2025 7:00 PM IST

మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఇపుడు నందమూరి నటసింహం బాలకృష్ణ వచ్చిన ఫామ్ మామూలు లెవెల్లో లేదని చెప్పాలి. తాను నటించిన నాలుగు సినిమాలు వరుస సూపర్ హిట్స్ అవ్వడం ఇంకా తన నుంచి క్రేజీ లైనప్ కూడా ఆడియెన్స్ ని ఎగ్జైట్ చేయడంతో రానున్న రోజుల్లో బాలయ్య తాండవం మామూలుగా ఉండదని ఒక క్లారిటీ ఇపుడు నుంచే ఉందని చెప్పాలి.

అయితే ఆల్రెడీ ఇపుడు “అఖండ 2” తో బిజీగా ఉన్న బాలయ్య నెక్స్ట్ మరింతమంది యువ దర్శకులతో వర్క్ చేయనున్నారు. అయితే వీటిలో ఓ క్రేజీ బజ్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో బాలయ్య మన టాలీవుడ్ కి చెందిన ఓ క్రేజీ సినిమాటిక్ యూనివర్స్ లోకి అడుగు పెట్టబోతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి ఈ బజ్ ప్రకారం మన టాలీవుడ్ లో సూపర్ “హిట్” ఫ్రాంచైజ్ అయినటువంటి హిట్ యూనివర్స్ లోకి బాలయ్య అడుగు పెట్టబోతున్నారట.

ఆల్రెడీ ఈ యూనివర్స్ లో విశ్వక్ సేన్, అడివి శేష్ అలాగే ఇపుడు నాని సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా మారాయి. అయితే ఇపుడు లేటెస్ట్ గా నాలుగో సినిమాకి బాలయ్య ఫిక్స్ అయ్యినట్టుగా సాలిడ్ బజ్ వినిపిస్తుంది. మరి ఇది కనుక నిజం అయితే హిట్ యూనివర్స్ మాస్ హిట్ యూనివర్స్ అవుతుందని చెప్పడంలో డౌట్ లేదు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఒక్కటి ఇంకా రావాల్సి ఉంది. మొత్తానికి మాత్రం బాలయ్య లైనప్ ఓ క్రేజీ లెవెల్లో ఉండేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు