బాలయ్య సర్ప్రైజ్.. సన్నీ డియోల్ వీరమాస్ కాంబినేషన్ సెట్స్ లో

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. తన కెరీర్ 109వ సినిమాని దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం టైటిల్ టీజర్ ని ఈ దీపావళి కానుకగా అందిస్తామని తెలిపారు. అయితే బాలయ్య లేటెస్ట్ గా ఓ సినిమా టీం ని సర్ప్రైజ్ చేశారు.

బాలయ్యతో “వీరసింహా రెడ్డి” అనే భారీ హిట్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని అలాగే బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కాంబినేషన్ లో చేస్తున్న వీరమాస్ యాక్షన్ డ్రామా షూటింగ్ సెట్స్ లో బాలయ్య సందడి చేసినట్టుగా మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు. దీనితో సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. మరి హీరో సన్నీ డియోల్ తో అలాగే దర్శకుడు గోపీచంద్ తో ముచ్చటిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. దీనితో ఈ క్రేజీ కలయిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version