మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఎప్పుడూ ప్రయోగాలు చేసేందుకు ముందు అడుగు వేసే హీరోస్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఒకరు. పలు చిత్రాలు ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ వాటిలో కూడా బాలయ్య నుంచి ఏదో ఒక కొత్తదనం ట్రై చేశారు అనే మార్క్ తప్పకుండా ఉంటుంది. మరి అలా బాలయ్య కెరీర్లో చేసిన ఎన్నో ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో ఇండియాస్ ఫస్ట్ ఎవర్ సై ఫై చిత్రం “ఆదిత్య 369” కూడా ఒకటి.
దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ టైం ట్రావెల్ డ్రామా అప్పట్లో రికార్డులు తిరగరాసింది. అయితే ఈ సినిమా ఇపుడు మళ్ళీ రీరిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది. ఈ మహా శివరాత్రి కానుకగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. టీవిలో వచ్చినప్పుడే ఎన్నోసార్లు రిపీట్స్ లో చూసిన ఆడియెన్స్ ఉన్నారు. మరి బిగ్ స్క్రీన్ పై ఈ సినిమాకి ఎలాంటి వెల్కమ్ ఈ తరం నుంచి అందుతుందో చూడాలి.