బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ – ఫ్లెక్సీ వార్ లో బాలయ్య తప్పుందా?

బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ – ఫ్లెక్సీ వార్ లో బాలయ్య తప్పుందా?

Published on Jan 18, 2024 4:36 PM IST


తెలుగు సినిమా ఆరాధ్య దైవం అలాగే తెలుగు సినిమా కోసం సహా తెలుగు ప్రజల మనుగడ కోసం కూడా ఎంతగానో శ్రమించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును ఇప్పుడు తెలుగు సినిమా అభిమానులు అలానే నందమూరి అభిమానులు కూడా మరోసారి తలుచుకుంటున్నారు. అయితే నేడు ఆ మహనీయుని 28వ వర్ధంతి కావున నందమూరి కుటుంబం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరి తమ నివాళులు అర్పించారు.

అయితే ఎన్టీఆర్ వారసుడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఘాట్ వద్దకు చేరుకోగా అక్కడ నెలకొన్న కొన్ని పరిస్థితులు రీత్యా తాను మరోసారి ట్రెండింగ్ టాపిక్ లోకి మారారు. అక్కడ కనిపించిన కొన్ని ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్ సహా కళ్యాణ్ రామ్ హరికృష్ణ సంబంధించి ఫ్లెక్సీలు కనిపించాయి.

దీనితో బాలయ్య ఆ కటౌట్ లు అన్నీ తీయించేయాలని అనుచరులతో చెప్పారు. చెప్పినట్టుగానే తీసేయడం వార్తలుగా మారాయి. ఇంకా కొన్ని అయితే ఇది కాస్త బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లా కూడా సోషల్ మీడియాలో మారింది. అయితే వారు వెళ్లిన సందర్భం ఏమిటి అనేది కూడా అందరూ గమనించాల్సి ఉంది.

అలాంటి సమయంలో ఆ తరహా కటౌట్లు మాత్రమే కాకుండా అలాంటి ఏ హంగులు కూడా ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు అనేది అవి పెట్టించినవారు అయినా ఒకసారి ఆలోచించాల్సింది. అందుకే బాలయ్య అలాంటివి అన్నీ తీయించి ఉండొచ్చు కదా అనేది మరో ప్రశ్న. అలాగే ఆల్రెడీ అవే కాకుండా అక్కడ ఉన్న అన్ని ఫ్లెక్స్ లను కూడా బాలయ్య తీయించేశారని కొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇప్పుడు ఈ ఇష్యూ సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు