క్రాక్, ఉప్పెన డైరెక్టర్స్ తో బాలయ్య ?

Published on Feb 28, 2021 1:05 am IST

బాలయ్య బాబు ప్రస్తుతం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం బోయపాటితో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత వెంటనే క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నాడు. అనంతరం ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కూడా ఒక సినిమా కమిట్ అయ్యాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోందట.

మరి బుచ్చిబాబు బాలయ్య కోసం ఎలాంటి కథను తయారుచేస్తాడో చూడాలి. అదేవిధంగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – బాలయ్య’ కలయికలో కూడా ఓ సినిమా రానుంది. ప్రస్తుతం పూరి కథ రాస్తోంది బాలయ్య కోసమేనని.. ఇప్పటికే పూరి, బాలయ్యకి కథ వినిపించాడని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇప్పటికే బాలయ్య – పూరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చింది. ఆ సినిమాలో బాలయ్యను చాల కొత్తగా చూపించాడు పూరి. మొత్తానికి బాలయ్య లిస్టులో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :