బాలయ్య బ్లాక్ బస్టర్ ‘అఖండ’ కు రెండేళ్లు

బాలయ్య బ్లాక్ బస్టర్ ‘అఖండ’ కు రెండేళ్లు

Published on Dec 2, 2023 5:02 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అఖండ. ఈ మూవీలో బాలయ్య రైతు గా అలానే అఘోరా గా రెండు పాత్రల్లో కనిపించి తన అద్భుత నటనతో ఆడియన్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు. ఈ యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ మూవీలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా నెగటివ్ పాత్రల్లో శ్రీకాంత్, నితిన్ మెహతా నటించారు. థమన్ సంగీతం అందించిన సాంగ్స్, బీజీఎమ్ ఈ మూవీకి ప్రధాన హైలైట్ గా నిలిచాయి.

ఇక ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ద్వారకా క్రియేషన్స్ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన అఖండ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుని నిర్మాతలు, బయ్యర్లకు కాసులు కురిపించింది. ఇక ఈ మూవీ నేటితో సక్సెసుల్ గా రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో పలువురు బాలయ్య ఫ్యాన్స్ అలానే ఆడియన్స్ యూనిట్ కి తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు