‘దేవర’ కోసం భారీగా ప్లాన్ చేసిన బళ్లారి ఫ్యాన్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు. ఇక ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మాసివ్ రెస్పాన్స్ రావడంతో ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బళ్లారి ఫ్యాన్స్ భారీ ప్లాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

బళ్లారిలో సెప్టెంబర్ 26న పండుగ జరుపుకుంటున్నామని.. దానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్నామని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. ఈ వేడుకులు కనీవిని ఎరుగని రీతిలో ఉంటాయని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోని కూడా వారు రిలీజ్ చేశారు. ఇలా ఓ తెలుగు సినిమా కోసం కన్నడ అభిమానులు గ్రాండ్ సెలెబ్రేషన్స్‌కు సిద్ధమవుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ‘దేవర’ సినిమాను పాన్ ఇండియా మూవీగా మేకర్స్ గ్రాండ్ స్కేల్‌లో రిలీజ్ చేయనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Exit mobile version