ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘బాలు గాని టాకీస్’

మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కి తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సినిమాను ఆహా త్వరలో స్ట్రీమింగ్ చేయనుంది. ‘బాలు గాని టాకీస్’ అనే సినిమాను ఆహాలో త్వరలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్‌ను ఆహా ప్రకటించింది. ‘బాలు గాని టాకీస్’ చిత్రాన్ని అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది. ఇక ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్‌తో ఆద్యంతం అలరించే కంటెంట్‌తో రాబోతున్నట్లు మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

శివ రామచంద్రవరపు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శరణ్య శర్మ, రఘు కుంచె తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను విశ్వనాథ్ ప్రతాప్ డైరెక్ట్ చేస్తుండగా, శ్రీనిధి సాగర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్మరణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version