ఆహా నుంచి మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీ ‘బాలుగానీ టాకీస్’

ఆహా నుంచి మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీ ‘బాలుగానీ టాకీస్’

Published on Jul 22, 2024 2:02 PM IST

ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా నుంచి మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆహా ఒరిజినల్ గా రానున్న ఈ మూవీకి ‘బాలుగానీ టాకీస్’ అనే ఆస‌క్తిక‌ర టైటిల్ ను మేక‌ర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను త్వ‌ర‌లో స్ట్రీమింగ్ చేయనున్న‌ట్లు ఆహా వెల్ల‌డించింది.

ఇక ఈ సినిమాలో శివ‌రామ చంద్ర‌వ‌ర‌పు, ర‌ఘు కుంచె, శ‌ర‌ణ్య శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ సినిమా క‌థ థియేట‌ర్ నేప‌థ్యంలో రానుంద‌ని అనౌన్స్ మెంట్ పోస్ట‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ”అతి త్వరలో, మీ అభిమాన ‘బాలుగానీ టాకీస్’ లో! అందరూ జై బాలయ్య అంటూ రెడీ అయిపోండి!!” అంటూ ఈ సినిమాపై ఆస‌క్తిని క్రియేట్ చేస్తున్నారు మేక‌ర్స్.

ఈ సినిమాను విశ్వ‌నాథ్ ప్ర‌తాప్ డైరెక్ట్ చేస్తుండ‌గా.. స్మ‌ర‌ణ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ‌నిధి సాగ‌ర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు