బండ్ల గణేష్ గండం నుంచి గట్టెక్కినట్టే

Published on Apr 15, 2021 7:13 pm IST

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ రెండవసారి కరోనాకు గురైన సంగతి తెలిసిందే. కారోనా లక్షణాలు కనబడగానే ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే మొదటిసారి కంటే రెండవసారి వైరస్ ఆయన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చేరిన ఆరంభంలో ఆయన పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉన్నా ఇప్పుడు మాత్రం కోలుకుంటున్నారట.

చికిత్సకు స్పందిస్తూ మెల్లగా రికవర్ అవుతున్నారట. ప్రస్తుతం అయన కండిషన్ మెరుగ్గానే ఉందట. ఐసీయూ నుండి నార్మల్ వార్డుకు షిఫ్ట్ చేశారట. దీంతో ఆయనకు గండం గడిచినట్టే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇటీవల జరిగిన ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ గురించి అనర్గళంగా మాట్లాడి వార్తల్లోకెక్కారు బండ్ల. ఆయన స్పీచ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు బండ్ల గణేష్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్, తీన్మార్’ లాంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :