పవన్ – సుజీత్ మూవీపై బండ్ల గణేష్ రెస్పాన్స్ ఇదే.!

Published on Dec 4, 2022 12:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు అనౌన్స్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో తెరకెక్కనుంది. ఇక ఈ అనౌన్సమెంట్ తో ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లగా ఈ కాన్సెప్ట్ పోస్టర్ కి సోషల్ మీడియాలో అదిరే రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అయితే పవన్ మరో హార్డ్ కోర్ ఫ్యాన్ మరియు ప్రముఖ నిర్మాత సహా నటుడు బండ్ల గణేష్ ఈ చిత్రంపై సాలిడ్ రెస్పాన్స్ ని అయితే అందించారు.

“భారత చలన చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ చిత్రంగా నిలవాలని నిలిచే విధంగా రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బండ్ల గణేష్” అంటూ తనదైన శైలిలో తన దేవర కోసం అయితే స్పందన అందించారు. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని అయితే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా ఈ చిత్రం షూట్ అతి త్వరలోనే స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :