‘జీ 5’ ఓటీటీ లక్ష్యం ఒక్కటే.. వీక్షకులకు వినోదం అందించడమే. కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా.. ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడమే ‘జీ 5’ ముఖ్య ఉద్దేశం. ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్లు, కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తోంది ‘జీ 5’. తాజాగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ ‘బంగార్రాజు’ను విడుదల చేయడానికి సిద్ధమైంది.
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “బంగార్రాజు”. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మల్టీస్టారర్ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి తీసుకొస్తోంది ‘జీ 5’. ఫిబ్రవరి 18 నుంచి ‘జీ 5’ ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఇటీవల ‘లూజర్ 2’తో వీక్షకుల మనసులను మరోసారి గెలుచుకుంది ‘జీ 5’. ఈ నెల 11న అక్కినేని మనవడు సుమంత్ హీరోగా నటించిన ‘మళ్ళీ మొదలైంది’ సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా ఓటీటీలో విడుదల చేస్తోంది.