రెగ్యులర్ షూటింగ్ లో బెల్లంకొండ గణేష్ చిత్రం

నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఇటీవలే ఓ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెల 5న అన్నపూర్ణ స్టూడియోస్ లో టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం రెగులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ని దర్శకుడు పూర్తి చేసేపనిలో పడ్డారు. దర్శకుడు పవన్ సాధినేని ఈ మూవీని లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారని సమాచారం. ఈ చిత్ర టైటిల్ ఇంకా నిర్ణయించాల్సి ఉండగా హీరోయిన్ కూడా ఇంకా ఎంపిక చేయాల్సివుంది.

బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెక్కం వేణు గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రాధన్ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదలయ్యే అవకాశం కలదు. బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు ఇప్పటికే టాలీవుడ్ లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది సాయి శ్రీనివాస్ రాక్షసుడు చిత్రంతో హిట్ అందుకున్నారు.

Exit mobile version