టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన తన కెరీర్‌లో నటిస్తున్న 12వ చిత్రాన్ని పూర్తి అడ్వెంచర్ కథతో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘హైందవ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలోని మెయిన్ కాన్సెప్ట్ ఏమిటనేది మనకు ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌లో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో హైందవ ఆలయాలకు సంబంధించిన రహస్యాలు మనకు చూపెట్టబోతున్నారని ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. హిందుత్వాన్ని హీరో ఎలా కాపాడతాడు అనేది మనం సినిమాలో చూడాల్సి ఉంటుంది.
ఇక ఈ సినిమాను దర్శకుడు లుధీర్ బైరెడ్డి ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్‌ఫుల్ మేకోవర్‌తో కనిపించనున్నాడు. అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా లియోన్ జేమ్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించనున్నాడు. ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి