టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికే పలు చిత్రాలను వరుసగా లైన్‌లో పెట్టాడు. ఆయన నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే, ఈ హీరో గతంలో దర్శకుడు సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో ‘టైసన్ నాయుడు’ అనే సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది.
అయితే, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు చిత్ర యూనిట్. ప్రస్తుతం నేపాల్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో పాటు ప్రగ్యా జైస్వాల్ పాల్గొంటుంది. వీరిద్దరిపై ఇంట్రెస్టింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. ఈ షెడ్యూల్ దాదాపు 5 రోజులు కొనసాగనుందట. ఇక ఆ తర్వాత హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
ఇక ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రఫ్ లుక్‌లో కనిపించనున్నాడు. నభా నటేష్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది.