బ‌జ్.. అలాంటి పాత్ర‌లో డేర్ చేయ‌బోతున్న హీరో..?

బ‌జ్.. అలాంటి పాత్ర‌లో డేర్ చేయ‌బోతున్న హీరో..?

Published on Jul 12, 2024 11:00 AM IST

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే ఆయ‌న ‘టైస‌న్ నాయుడు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాక‌ముందే, త‌న నెక్ట్స్ చిత్రాన్ని రీసెంట్ గా లాంచ్ చేశాడు. ద‌ర్శ‌కుడు కౌశిక్ డైరెక్ష‌న్ లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు ఇప్పుడు మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఓకే చెప్పాడ‌ట‌.

కొత్త ద‌ర్శ‌కుడు లుధీర్ డైరెక్ష‌న్ లో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అయితే, ఈ సినిమా క‌థ చాలా కొత్త‌గా ఉండ‌బోతుంద‌ని, ఈ సినిమాలో హీరో ఓ డేరింగ్ గెట‌ప్ లో క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ అఘోర పాత్ర‌లో న‌టిస్తాడ‌ని తెలుస్తోంది. ఈ వార్త‌తో అభిమానుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్ప‌డింది.

ఇక ఈ సినిమా బెల్లకొండ శ్రీ‌నివాస్ కెరీర్ లోనే కాస్ట్లియెస్ట్ మూవీగా రానుంద‌ట‌. కాగా, ఈ సినిమాకు హైంధ‌వ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఈ సినిమాను చందు మ‌హేష్, సాయి శ‌శాంక్ లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయ‌నున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను అతి త్వ‌ర‌లో ప్రారంభించేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. మ‌రి నిజంగానే ఈ సినిమాలో హీరో అఘోర పాత్ర‌లో న‌టించి డేర్ చేయ‌బోతున్నాడా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు