‘టైసన్ నాయుడు’ అప్డేట్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

‘టైసన్ నాయుడు’ అప్డేట్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

Published on Sep 1, 2024 12:32 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టైసన్ నాయుడు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా గురించి హీరో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.

ప్రస్తుతం టైసన్ నాయుడు షూటింగ్ నిర్విరామంగా జరుగుతుందని.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇకపై ఇస్తామని ఆయన తెలిపారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల భామలు నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ‘టైసన్ నాయుడు’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా..14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు