పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన బెల్లంకొండ శ్రీ‌నివాస్ కొత్త సినిమా

పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన బెల్లంకొండ శ్రీ‌నివాస్ కొత్త సినిమా

Published on Jul 1, 2024 11:52 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె చంద్ర డైరెక్ష‌న్ లో ‘టైసన్ నాయుడు’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఇక ఈ సినిమా పూర్తి కాక‌ముందే, బెల్లంకొండ శ్రీ‌నివాస్ త‌న కొత్త సినిమాను ప్రారంభించాడు.

‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ష‌న్ లో బెల్లంకొండ శ్రీ‌నివాస్ త‌న కెరీర్ లోని 11వ చిత్రాన్ని తాజాగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించాడు. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర షూటింగ్ మొద‌లైంది. ‘BSS11’ అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ప్రారంభించారు చిత్ర యూనిట్. ఇక రెగ్యుల‌ర్ షూటింగ్ ను త్వ‌ర‌లోనే మొద‌లుపెట్ట‌నున్నారు.

ఈ సినిమాలో అందాల భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌ణ్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, అజ‌నీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహు గార‌పాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు