యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “భీమ్లా నాయక్” అనే సినిమా చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కె చంద్ర తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈరోజు శ్రీను బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని అయితే రిలీజ్ చేశారు.
మరి ఈ చిత్రంకి “టైసన్ నాయుడు” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేయగా ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ మంచి ఎలెక్ట్రఫయింగ్ గా కనిపిస్తున్నాడు. ఒక బాక్సర్ గా అలాగే పోలీస్ ఆఫీసర్ కావాలి అనుకుంటున్న యువకుడులా కనిపిస్తున్నాడు. లేదా ఆల్రెడీ పోలీస్ నా అనేది మున్ముందు చూడాలి. అలాగే గ్లింప్స్ యాక్షన్ విజువల్స్ కూడా తనకి తగ్గట్టుగా సాలిడ్ లెవెల్లో ఉన్నాయి. ఇందులో భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ కూడా బాగుంది. ఇక ఈ చిత్రానికి 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తుండగా మేకర్స్ శరవేగంగా సినిమాని కంప్లీట్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి