2024లో బెస్ట్ ఆల్బమ్ ఇదే.. కానీ టాప్ మాత్రం వేరే!

2024 సంవత్సరం ముగింపుకు చేరుకుంది. ఈ ఏడాది టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలను క్రియేట్ చేయగా, మరెన్నో సినిమాలు ఆడియెన్స్‌ను కట్టిపడేశాయి. ఇక మ్యూజిక్ పరంగా కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకుల్లో చెరగని ముద్రను వేసుకున్నాయి. ఈ ఏడాది రిలీజ్ అయి సినిమాల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సాంగ్స్ ఉన్నాయి. మరి వాటిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన బెస్ట్ ఆల్బమ్ ఏమిటో చూద్దామా.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రానికి తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో ఫియర్ సాంగ్‌తో మొదలైన పాటలు, ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటూ వెళ్లాయి. ఇక దేవర నుండి వరుసగా రిలీజ్ అయిన చుట్టమల్లె, ఆయుధ పూజ, దావూదీ.. ఇలా ప్రతి పాటకు కూడా ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ‘దేవర’ మ్యూజిక్ ఆల్బమ్ 2024లో బెస్ట్ అని ప్రేక్షకులు నిర్ణయించారు.

అయితే, ఈ పాటలన్నీ హిట్‌గా నిలిచినా కూడా, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌ను బీట్ చేయలేకపోయాయి. థమన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇలా టాప్ స్థానంలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌తో మహేష్ బాబు మూవీ దుమ్ములేపుతోందని చెప్పాలి.

Exit mobile version