నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం డీసెంట్ టాక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 2019లో వచ్చిన మంచి చిత్రాల్లో ‘జెర్సీ’ ముందు వరుసలో ఉంటుంది. మరి అలాంటి జెర్సీకి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాలేదు. కానీ అవార్డులు మాత్రం బాగానే వచ్చాయి. తాజాగా జెర్సీ మరో ప్రత్యేక అవార్డు వచ్చింది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2019లో జెర్సీ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ను అందుకుంది. మొత్తానికి క్లాసిక్ హిట్.. డీసెంట్ హిట్ అంటూ కీర్తించబడిన ‘జెర్సీ’కి ఈ అవార్డు మరో రివార్డ్ అనుకోవాలి.
కాగా గౌతమ్ దర్శకత్వంలో నాని హీరో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా నాని కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. మొత్తానికి ‘జెర్సీ’ సాధారణ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులను కూడా బాగా మెప్పించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కనిపించనుంది.
ఇక జెర్సీకి వచ్చిన అవార్డులను చూస్తే..
– 2019 సంవత్సరానికి 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించిన కేంద్రం
– ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
– ఉత్తమ ఎడిటర్ – జెర్సీ(నవీన్ నూలీ)
– ఉత్తమ వినోదాత్మక చిత్రం- మహర్షి
– ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి)
– ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)