50 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “భగవంత్ కేసరి” హిందీ వెర్షన్!

50 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “భగవంత్ కేసరి” హిందీ వెర్షన్!

Published on Jul 4, 2024 9:56 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించగా, యంగ్ బ్యూటీ శ్రీ లీల మరొక కీలక పాత్రలో నటించడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, హిందీ వెర్షన్ యూ ట్యూబ్ లో అందుబాటులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం హిందీ వెర్షన్ 50 మిలియన్ కి పైగా వ్యూస్ ను రాబట్టడం జరిగింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి అద్దిరిపోయే సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు