రామ్ పోతినేని నెక్స్ట్ నుంచి అలరిస్తున్న భాగ్యశ్రీ లుక్..

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా కోసం తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ డిజప్పాయింట్మెంట్ తర్వాత మళ్ళీ క్లాస్ లుక్ లోకి మారిపోయిన రామ్ ఫ్రెష్ గా ఈ సినిమా జర్నీ స్టార్ట్ చేసాడు. అయితే అనౌన్సమెంట్ నుంచే మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఈ కొత్త సంవత్సరం కానుకగా మేకర్స్ ఆమెపై ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో భాగ్యశ్రీ బ్యూటిఫుల్ లుక్స్ లో అలరిస్తుండగా రామ్ కూడా ఆమెతో మంచి రొమాంటిక్ లుక్ లో అలాగే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇలా మొత్తానికి అయితే ఇద్దరు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని మేకర్స్ అందించారు. ఇక ఈ చిత్రానికి మెర్విన్ సోలమన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version