పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భైరవ ఆంథెం వీడియో సాంగ్ ఎట్టకేలకు వచ్చేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 AD’ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ గా భైరవ ఆంథెం ను మేకర్స్ రిలీజ్ చేశారు.
కాగా, జూన్ 16న ఈ పాటను ఆడియో వర్షన్ లో రిలీజ్ చేశారు. తెలుగు, పంజాబీ కలయికలో ఈ పాట ఉండటంతో అభిమానులు దీన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సింగర్ దిల్జిత్ దోసాంజ్, దీపక్ బ్లూ, సంతోష్ నారాయణన్ కలిసి పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఇక వీడియో సాంగ్ లో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్స్ తో ఇరగదీశాడు. ఆయన వాకింగ్ స్టైల్ కు వారు ఫిదా అవుతున్నారు.
సంతోష్ నారాయణన్ అందించిన బీట్స్ ఈ పాటను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్ళాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఈ పాట వింటూ పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని వారు చర్చించుకుంటున్నారు. కాగా, ఈ సినిమాను జూన్ 27న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.