మంచు వారి యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా రీసెంట్ గా అనౌన్స్ చేసిన భారీ చిత్రం “భక్త కన్నప్ప” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ అంతా విదేశాల్లోనే చేస్తామని కంప్లీట్ అయ్యాక ఇండియా వస్తామని విష్ణు అండ్ టీం ముందే చెప్పారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు అనే వార్త ఒక్కసారిగా సినిమాని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లింది.
మరి ఈ భారీ చిత్రంలో ప్రభాస్ ఉన్నాడు అనే వార్తే చాలా ఎగ్జైటింగ్ అనుకుంటే నిజంగానే ఈ సినిమాని ఊహించని ప్లానింగ్ లు చేస్తున్నారట. ఇది జస్ట్ మొదలు మాత్రమే కాగా ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్ లు చాలా మంది స్టార్స్ పేర్లు కూడా యాడ్ కాబోతున్నాయి అని తెలుస్తుంది. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ఎలాంటి తప్పు లేకుండా మంచు వారి కుటుంబం చూస్తున్నారని చెప్పాలి.