సమీక్ష : భలే ఉన్నాడే – కొన్ని సీన్స్ బాగున్నా మిగతాది నిరాశే

Bhale Unnade Movie Review in Telugu

విడుదల తేదీ : సెప్టెంబర్ 13, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రాజ్ తరుణ్, మనీష కందుకూర్, గోపీకుమార్ అభిరామి, వీటివి గణేష్, హైపర్ ఆది, సింగీతం శ్రీనివాసరావు, లీలా సాంసన్.

దర్శకుడు: జే శివసాయి వర్ధన్

నిర్మాతలు : ఎన్ వి కిరణ్ కుమార్

సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: నగేష్ బనెల్

ఎడిట‌ర్ : శ్రీకాంత్ పట్నాయక్

సంబంధిత లింక్స్: ట్రైలర్

టాలీవుడ్ జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు మనీష కందుకూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “భలే ఉన్నాడే” ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథ:

ఇక కథ లోకి వస్తే.. రాధ (రాజ్ తరుణ్) తన తల్లి గౌరీ (గోపీకుమార్ అభిరామి) తోనే పెరుగుతాడు. తండ్రి లేని తాను ఒక సారీ డ్రిప్పర్ గా పెళ్ళిళ్ళకు పెళ్లి కూతుళ్ళకి చీరలు కట్టే వృత్తి చేస్తాడు. అయితే తన ప్రొఫిషనల్ పరంగా బయట కూడా ఆడవాళ్ళ పట్ల ఎంతో గౌరవంగా నిష్ఠగా రాధ ఉంటే తన లైఫ్ లోకి కొంచెం చురుకుగా కృష్ణ (మనీష కందుకూర్) వస్తుంది. మరి ఈమె వచ్చిన తర్వాత రాధ లైఫ్ లో జరిగిన మార్పలు ఏంటి? ప్రేమ నుంచి పెళ్లి వరకు వెళ్లే వీరి లైఫ్ ఎలా టర్న్ అవుతుంది? రాధకి ఏమన్నా లోపం ఉందా? అతను ఎందుకు ఆడవాళ్ళకి దూరంగా ఉంటాడు? చివరికి ఏమయ్యింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.

 

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో రాజ్ తరుణ్ తన మార్క్ క్లీన్ పెర్ఫామెన్స్ ని అందించాడు అని చెప్పాలి. తల్లి చాటు కొడుకుగా చాలా సింపుల్ లుక్స్ లో మరీ అగ్రెషన్ గా కాకుండా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని తాను ఈ సినిమాలో చేసాడు. అలాగే తాను ఈ సినిమాలో కొంచెం పార్ట్ కోసం అయినా తీసుకున్న డేరింగ్ స్టెప్ కి ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. తన కెరీర్ లో ఈ సినిమాలో పాత్ర నటుడుగా మంచి స్టెప్ తీసుకున్నాడని చెప్పాలి. అలాగే తన రోల్ ని చాలా బాగా చేసాడు.

ఇక హీరోయిన్ గా కనిపించిన మనీష తన రోల్ లో బాగానే చేసింది. రాజ్ తరుణ్ తో కొన్ని బాగున్నాయి. అలాగే గోపీకుమార్ అభిరామి మంచి రోల్ ని చేశారు. ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ పెర్ఫామెన్స్ బాగుంది. అలాగే ఈ ప్రీ క్లైమాక్స్ లోనే రాజ్ తరుణ్ తో ఒక సన్నివేశం అయితే టచ్ చేస్తుంది. ఇంకా అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి.

కృష్ణ భగవాన్, వి టి వి గణేష్, హైపర్ ఆదిలు సినిమాలో మంచి పెర్ఫామెన్స్ లు అందించారు. అలాగే హైపర్ ఆది తనలోని డాన్సర్ ని కూడా చూపించాడు. ఇక సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు అలాగే ప్రముఖ నృత్యకారిణి, నటి లీలా సాంసన్ ల నడుమ కనిపించే సీన్స్, ముఖ్యంగా లీలా సాంసన్ పై డాన్స్ ఎపిసోడ్ సినిమాలో చూసేందుకు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ మాత్రం దర్శకుడు బాగా తీసాడు.

 

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో లైన్ ఒకింత పర్వాలేదు అనిపిస్తుంది కానీ దానికి అనుగుణంగా సాగే కథనం మాత్రం అంత ఆకట్టుకునే విధంగా అనిపించదు. లీడ్ నటీనటులపై మరింత బెటర్ సీన్స్ చేయాల్సింది. అలాగే సినిమా చూస్తున్నంతసేపు చాలా వరకు అసలు దర్శకుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అర్ధం కాదు.

దీనితో రన్ టైం తక్కువ అయినా కూడా సినిమాలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అర్ధం కాదు. అలాగే రాజ్ తరుణ్ రోల్ ఎందుకు అలా ఉంది? అందుకు బలమైన కారణం ఏంటి అనేవి కూడా సినిమాలో సరైన వివరణ లేనట్టు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ మనీష ఈ సినిమాలో అంతగా సెట్ కాలేదు. చాలా వరకు ఆమె రాజ్ తరుణ్ సరసన ఒక హీరోయిన్ అన్నట్టు కనిపించదు.

అలాగే సినిమా ఒక చోట క్లీన్ గా వెళ్తుంది అనుకున్న సమయంలో కొంచెం బోల్డ్ సీన్స్ వంటివి వాటిని డిస్టబ్ చేసినట్టుగా అనిపిస్తాయి. అలాగే ఇవి ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇంకా సినిమాలో చాలా కామెడీ సీన్స్ వర్కౌట్ కాలేదు. లాజిక్ లేని కామెడీ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి మెయిన్ గా సెకండాఫ్ లో రచ్చ రవిపై సీన్ పొంతనే లేదు. ఇలా పలు అంశాలు సినిమాలో బాగా చిరాకు తెప్పిస్తాయి.

 

సాంకేతిక వర్గం:

సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. పాటలు నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ లో చాలా సీన్స్ కట్ చేయాల్సింది. ఇక దర్శకుడు జే శివసాయి వర్ధన్ విషయానికి వస్తే.. తాను ఈ సినిమాలో మంచి లైన్ నే ఎంచుకున్నారు అనిపిస్తుంది. కానీ దానితో తాను ఏం చెప్పాలి అనుకున్నారో దానిని సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు అని చెప్పక తప్పదు. కొన్ని సీన్స్ వరకు ఓకే కానీ మిగతా కథనం అంతా డల్ గా లాజిక్స్ లేకుండగా చికాకు తెప్పించేలా అనిపిస్తాయి. వీటితో అయితే తన వర్క్ బిలో యావరేజ్ గానే అనిపిస్తుంది.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “భలే ఉన్నాడే” లో నటుడుగా రాజ్ తరుణ్ మంచి రోల్ ని ఎంచుకున్నాడు దానిని చాలా బాగా చేసాడు. అలాగే లిమిటెడ్ కామెడీ సీన్స్ ఇంకా లిమిటెడ్ ఎమోషన్స్ మాత్రమే సినిమాలో మెప్పించే అంశాలు. కానీ డిజప్పాయింట్ చేసే అంశాలు మాత్రం చాలానే ఉన్నాయి. సో వీటితో సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version