విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, చైతు జొన్నలగడ్డ, సందీప్ వేద్, అనూజ్ గుర్వార, రఘు ముఖర్జీ
దర్శకుడు : అభిమన్యు తడిమేటి
నిర్మాతలు: భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర
సంగీత దర్శకులు: ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ: దీపక్ యరగేర
ఎడిటింగ్: విప్లవ్ నైషదం
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఓటిటిలో అందులోని మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహా లో ప్రసారంకి వచ్చిన ఒరిజినల్ చిత్రాల్లో నటి ప్రియమణి నటించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “భామా కలాపం” కూడా ఒకటి. మరి ఈ చిత్రంకి సీక్వెల్ ని ఆహా వారు ఇపుడు తీసుకొచ్చారు. మరి ఈ సీక్వెల్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ :
గతంలో జరిగిన క్రైమ్ తర్వాత అనుపమ(ప్రియమణి) ముందు ఉండే ఇంటి నుంచి వేరే ఇంటికి తన కుటుంబం సహా షిఫ్ట్ అయ్యిపోతారు. అలాగే తన యూట్యూబ్ ఛానెల్ నుంచి వచ్చిన డబ్బుతో తన పాత పనిమనిషి శిల్ప(శరణ్య ప్రదీప్) నే పార్ట్నర్ గా చేసుకొని చిన్న హోటల్ పెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది. అలా పెట్టుకున్నాక నగరంలో ఓ పేరు మోసిన బిజినెస్ మెన్ ఆంటోనీ లోబో(అనూజ్ గుర్వార) వంటలు కాంపిటేషన్ ముసుగులో డ్రగ్ డీలింగ్స్ చేస్తూ ఉంటాడు. మరి ఈ వంటలో కాంపిటేషన్ లో ఎంపిక అయ్యిన అనుపమ ఆ డ్రగ్ మాఫియాలో ఎలా ఇరుక్కోవాల్సి వచ్చింది? ఈ డ్రగ్ మాఫియా నుంచి బయటకి వచ్చిందా లేదా? ఈ మొత్తంలో డిసౌజా(సీరత్ కపూర్) పాత్ర ఏంటి అనేది తెలియాలి అంటే ఈ ఒరిజినల్ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్ :
చాలా సీక్వెల్ చిత్రాలు మొదటి పార్ట్ తో పోలిస్తే కంప్లీట్ గా మార్చేయడం జరుగుతుంది. కానీ ఈ సినిమా మాత్రం ఫస్ట్ పార్ట్ ఎండింగ్ తోనే కనెక్షన్ పెడుతూ డీల్ చేయడం బాగుంది. అలాగే ఈ చిత్రంలో కథనం వెళ్తున్న కొద్ది పలు ఆసక్తికర సన్నివేశాలు ట్విస్ట్ లతో ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది.
అలాగే మరోసారి ప్రియమణి అయితే తన రోల్ లో షైన్ అయ్యారని చెప్పాలి. అలాగే తనతో పాటుగా యంగ్ నటి శరణ్య మరోసారి ఆద్యంతం మంచి సపోర్ట్ ఇస్తూ మంచి కామెడీ టైమింగ్ తో నవ్వు తెప్పిస్తుంది. ఇక ఈ చిత్రంలో స్పెషల్ ప్యాకేజ్ సీరత్ కపూర్ అని చెప్పాలి.
ఆమె తన గ్లామ్ షో తోనే కాకుండా నటిగా కూడా ఇంప్రెస్ చేస్తుంది. దీనితో పాటుగా కొన్ని సీన్స్ అక్కడక్కడా ఆసక్తి కలిగిస్తాయి. ఇక మెయిన్ లీడ్ తో పాటుగా నెగిటివ్ పాత్రల్లో కనిపించిన రఘు ముఖర్జీ, సందీప్ వేద్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఇంప్రెస్ చేస్తారు.
మైనస్ పాయింట్స్ :
ఇక సినిమాలో అంతగా మెప్పించని విషయాల్లోకి వస్తే ఈ హెయిస్ట్ థ్రిల్లర్ మరింత ఎంగేజింగ్ గా ఉండాల్సింది. కొన్ని కొన్ని సీన్స్ వరకు పర్వాలేదనిపించినా కొంతమేర నరేషన్ డల్ గా అనిపిస్తుంది. అలాగే మొదటి పార్ట్ చూసిన వారికి అనిపించే లోపం ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ పార్ట్ లో కనిపించే కామెడీ కూడా ఇందులో కొంతమేర తగ్గింది.
మంచి కామెడీని ఎంజాయ్ చేస్తూ ఈ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారు ఈ విషయంలో డిజప్పాయింట్ కావచ్చు. ఇక ప్రియమణి పాత్రలో కొన్ని అంశాలు ఆశ్చర్యపరుస్తాయి. సాధారణ గృహిణి అయినటువంటి ఆమె చేసే కొన్ని యాక్షన్ సీన్స్ కన్వీనెన్స్ గా అనిపించదు. అలాగే ఈ చిత్రం క్లైమాక్స్ పోర్షన్ కూడా అంత మెప్పించే విధంగా ఉండదు. అలాగే కొన్ని సీన్స్ ఊహించదగిన విధంగానే ఉంటాయి.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మొదటి పార్ట్ తో పోలిస్తే ఫ్రాంచైజ్ తీసుకెళ్తున్న దీనిని మరింత ఎక్కువ ఖర్చుతో ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక టెక్నీకల్ టీం లో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వర్క్ లు ఇంప్రెసివ్ గా ఉన్నాయి. అలాగే ఎడిటింగ్ కూడా పర్వాలేదు.
ఇక దర్శకుడు అభిమన్యు తడిమేటి విషయానికి వస్తే లాస్ట్ టైం కోడి గుడ్డు తో మంచి థ్రిల్ అండ్ కామెడీ రైడ్ ని ఇస్తే ఈసారి కోడితో ఒక ఇంట్రెస్టింగ్ హెయిస్ట్ థ్రిల్లర్ ని డిజైన్ చేసుకోవడం బాగుంది. కానీ ఈసారి మాత్రం కొంచెం అంచనాలకి మ్యాచ్ అవ్వడంతో మిస్ ఫైర్ అయ్యిందని చెప్పాలి. తాను చూపించిన కొన్ని డీటెయిల్స్ బాగున్నాయి కానీ కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి. అలాగే క్లైమాక్స్ పోర్షన్ ని కూడా కొంచెం ఓవర్ అనిపిస్తుంది. ఇవి మినహా ఈ సినిమాకి తన వర్క్ ఆకట్టుకుంటుంది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “భామా కలాపం 2” కొన్ని అంశాలు ఆకట్టుకుంటాయి. ప్రియమణి అలాగే శరణ్య ప్రదీప్ ల పెర్ఫామెన్స్ లు ఇంప్రెస్ చేస్తాయి. అలాగే కొన్ని ట్విస్ట్ లు హెయిస్ట్ సీన్స్ ఒక మాదిరిగా ఆకట్టుకుంటాయి. అయితే కొంతమేర డల్ గా ఊహించదగిన రేంజ్ లో సాగే కథనం వీక్ క్లైమాక్స్ ఈ చిత్రంలో డిజప్పాయింట్ చేస్తాయి. వీటితో పార్ట్ 1 ని చూసినవారు అయితే కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకొని చూస్తే ఈ క్రైమ్ థ్రిల్లర్ పర్వాలేదనిపిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team